KMM: కుర్నవల్లికి చెందిన రైతు అయిలూరి కోటిరెడ్డికి ఉత్తమ రైతు పురస్కారం లభించింది. ఆధునిక పద్ధతిలో సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధించినందుకు గాను, రైతు వేదికలో AO తాజుద్దీన్ ఈ పురస్కారాన్ని అందజేశారు. కోటిరెడ్డి వరి విత్తే విధానంలో, నూతన వరి వంగడాలను, అధునాతన సాంకేతిక పద్ధతులను అవలంబిస్తున్నారని ఏవో ప్రశంసించారు.