KMR: దోమకొండలోని వైన్స్ దుకాణాలను గ్రామం బయట ఏర్పాటు చేయాలని పట్టణ కాంగ్రెస్ నాయకులు కోరారు. ఈ మేరకు శనివారం వారు ఎక్సైజ్ సీఐ మధుసూదన్ రావుకు వినతిపత్రం అందజేశారు. జనవాసాల మధ్య వైన్స్ దుకాణాలు ఉండటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంతరెడ్డి అన్నారు. అధికారులు తగు చర్యలు తీసుకొవాలన్నారు.