NRML: నర్సాపూర్ మండలంలో రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందిన ఘటన శనివారం రాత్రి జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. బైంసా నుంచి నిర్మల్ వైపు వెళుతున్న ప్రైవేట్ టీచర్ రాజ్ కుమార్ మండలంలోని నందన్ గ్రామ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.