ELR: మొంథా తుఫాను ప్రభావిత జిల్లాల్లో నష్టం అంచనా వేయడానికి 2 కేంద్ర బృందాలు ఈనెల 10, 11 తేదీల్లో పర్యటించనున్నాయి. హోమ్ శాఖ జాయింట్ సెక్రటరీ పౌసుమీ బసు నేతృత్వంలో మొత్తం 8 మంది అధికారులు రాష్ట్రానికి రానున్నారు. వీరు 2 టీమ్లుగా విడిపోయి ఏలూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, తూ.గో, కోనసీమ జిల్లాల్లో రెండు రోజులు పర్యటిస్తారని తెలిపారు.