W.G: కొప్పర్రు, రుస్తుంబాద, మంగళగుంటపాలెం ప్రాంత రైతులు ఇవాళ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పంట బోధులు పూడికతో నిండిపోవడం, గుర్రపు డెక్కలు అధికంగా ఉండడం వల్ల నీరు పంట పొలాలకు చేరక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. మున్సిపల్ డ్రైనేజీ నీరు పంట బోధుల్లోకి కలవడం, ఆక్రమణలు, చెట్లు కాలువల్లో పడిపోవడం వలన నీటి ప్రవాహం తగ్గిపోతుందన్నారు.