NDL: శ్రీశైలం ఆర్టీసీ బస్టాండ్ వద్ద 700 కేజీల PDS బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పల్నాడు జిల్లా వినకొండ మండలం నడిగడ్డకు చెందిన శ్రీను, దుర్గా వీరాంజనేయులు అనే ఇద్దరు వ్యక్తులు తక్కువ రేటుకు బియ్యం కొనుగోలు చేసి, ఆర్టీసీ బస్టాండ్ పార్కింగ్ స్థలంలో ఉంచినట్లు సీఐ జి. ప్రసాద రావు తెలిపారు. వీరిద్దరినీ అరెస్టు చేసి, కేసు నమోదు చేసినట్లు తెలిపారు.