WGL: నర్సంపేట పట్టణానికి చెందిన మైక్రో ఆర్టిస్ట్ శ్రీరామోజు జయకుమార్ మరోసారి తన ప్రతిభ కనబరిచాడు. బియ్యపు గింజపై 191 ఆంగ్ల అక్షరాలతో వందేమాతరం గీతాన్ని రాసి ఔరా అనిపించాడు. బంకించంద్ర చటర్జీ రచించిన ‘వందేమాతరం’ గేయం 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జయకుమార్ తన ప్రతిభ చూపించాడు. ఈ సందర్భంగా పలువురు ఆయనను అభినందించారు.