సత్యసాయి: APSRTC రాయలసీమ రీజనల్ బోర్డు ఛైర్మన్ పూల నాగరాజు శుక్రవారం పుట్టపర్తి బస్ స్టేషన్, డిపోలను సందర్శించారు. బస్ స్టేషన్లో ప్రయాణికులకు కల్పిస్తున్న మౌలిక వసతులపై ఆరా తీశారు. సత్యసాయిబాబా శత జయంతి వేడుకలకు భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.