W.G: ముందస్తు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల ద్వారా వ్యాధిని నూరు శాతం నిరోధించవచ్చని కలెక్టర్ నాగరాణి అన్నారు. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం భీమవరం ప్రకాశం చౌక్‌లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. క్యాన్సర్ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించినట్లయితే, వ్యాధి నుంచి కోలుకునే అవకాశం గణనీయంగా పెరుగుతుందని ఆమె తెలిపారు.