SKLM: నరసన్నపేట మండలం సత్యవరం గ్రామానికి చెందిన రాజ మహంతి శ్యామల అనే వితంతువు తనను ఆదుకోవాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తికి శుక్రవారం ప్రజా దర్భార్లో వినతి పత్రం సమర్పించారు. భర్త చనిపోయి ఐదేళ్లు దాటిందని, కుటుంబాన్ని పోషించడం కష్టంగా ఉందని ఆమె మొరపెట్టుకున్నారు. స్పందించిన ఎమ్మెల్యే ఆమెకు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.