ASF: జిల్లాలో అక్రమ కార్యకలాపాలు నిర్వహించే వారిపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని SP కాంతిలాల్ పాటిల్ శనివారం ప్రకటనలో తెలిపారు. పేకాట స్థావరాలపై జిల్లా పోలీసులు, టాస్క్ఫోర్స్ పోలీసులు ఎప్పటికప్పుడు దాడులు చేస్తూ పట్టుకున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ప్రజలు, యువత పోలీసులకు సహకరించాలని వారు కోరారు.