AP: ప్రజా సంకల్పయాత్ర పేరుతో వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టి 2019లో 151 సీట్లతో అధికారం చేపట్టారు. 2027లోనూ జగన్ పాదయాత్ర 2.0 ఉంటుందని పేర్ని నాని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ నుంచే పాదయాత్ర మొదలుపెట్టే అవకాశాలున్నాయి. 2019 ఎన్నికలకు ముందు ‘నవరత్నాలు’ మ్యానిఫెస్టో సిద్ధం చేసిన జగన్.. 2.0లో అంతకుమించి ఉన్నట్లు తెలుస్తోంది.