భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ జులన్ గోస్వామి జీవితం ఆధారంగా రాబోతున్న మూవీ ‘చక్దా ఎక్స్‌ప్రెస్’. ఈ మూవీ 2022లో షూటింగ్ పూర్తి చేసుకుంది. కొన్ని కారణాల వల్ల ఇది రిలీజ్ కాలేదు. తాజాగా మహిళా క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్ గెలిచిన నేపథ్యంలో దీని విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిపై మేకర్స్ నెట్‌ఫ్లిక్స్‌తో చర్చలు జరిపినట్లు టాక్.