SS: చిలమత్తూరు మండలంలోని చాగలేరు పంచాయితీలో మండల కన్వీనర్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శనివారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేద ప్రజలకు విద్య, వైద్యం దూరం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. పీపీపీ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.