కోనసీమ: అమలాపురం పట్టణంలో సంచలనం సృష్టించిన కంచిపల్లి శ్రీనివాస్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఎస్పీ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఎస్పీ రాహుల్ మీనా నిందితులను మీడియా ముందు హాజరు పరిచారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. తన ఉనికిని చాటుకునేందుకే ప్రధాన నిందితుడు కాసుబాబు ఈ హత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఈ కేసును చేధించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.