సూపర్ స్టార్ రజినీకాంత్ సోదరుడు సత్యనారాయణరావు గైక్వాడ్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఆయనను బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ICUలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న రజినీ బెంగళూరుకి వెళ్లారు. వైద్యులతో మాట్లాడి గైక్వాడ్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.