ATP: కార్తీకమాస ఉత్సవాలలో భాగంగా తాడిపత్రిలోని ప్రముఖ శైవక్షేత్రం బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయంలో 18వ రోజు సంకష్టహర చతుర్దశిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి గరికతో ప్రత్యేక అలంకరణ చేశారు. ఉదయం నుంచి స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సంకష్టహర చతుర్దశి సందర్భంగా ప్రత్యేక పూజలు, తీర్థప్రసాద వితరణ జరిగింది.