HYD: జూబ్లీహిల్స్ రిటర్నింగ్ అధికారి సాయిరాంకు ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్లు శనివారం మీడియాపై ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కొన్ని మీడియా ఛానల్స్, వెబ్ సైట్లలో కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా సర్వేల పేరుతో అసత్య ప్రచారం చేయడంపై వారు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.