KDP: పులివెందుల పట్టణంలో ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకెళ్తే తమిళనాడుకు చెందిన శరవణన్(39) స్థానిక గోవింద రాజా టెక్స్‌టైల్స్‌లో పనిచేస్తున్నాడు. పులివెందులలో అద్దెకు ఉంటున్నా ఇంట్లోనే అతను ఉరేసుకుని చనిపోయాడు. అనంతరం శరవణన్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.