AP: తిరుపతి జిల్లా మంగళంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రభుత్వ ఎర్రచందనం గిడ్డంగిని పరిశీలించారు. 8 గోడౌన్లలో ఉన్న ఎర్రచందనం అమ్మకాలు, నిల్వలపై ఆరా తీశారు. ప్రతి గోడౌన్లో రికార్డులు పరిశీలించారు. ప్రతి ఎర్రచందనం దుంగకి ప్రత్యేక బార్ కోడింగ్, లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు.