గబ్బా స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా చివరి టీ20లో తలపడుతోంది. అయితే, స్టేడియం పరిసర ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో ఉరుములు, మెరుపులు కూడిన వర్షం పడుతోంది. అక్కడ పిడుగులు పడే అవకాశం ఉండటంతో మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులను స్టేడియం అధికారులు అప్రమత్తం చేశారు. ప్రేక్షకులు బహిరంగ ప్రదేశాలను వీడి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.