రాష్ట్ర వ్యాప్తంగా ఎట్టకేలకు చెరువుల్లోకి చేప పిల్లల పంపిణీ ప్రారంభమైంది. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం వందశాతం రాయితీతో చేప పిల్లలను ఉచితంగా అందిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 1200 చెరువులు, ప్రాజెక్టులు, కుంటల్లో మొత్తం ఆరు కోట్ల చేప పిల్లలను విడుదల చేయనున్నారు. కాగా, ఇప్పటివరకు 60 లక్షల చేప పిల్లలను పంపిణీ చేసినట్లు మత్స్యశాఖ అధికారులు తెలిపారు.