KMR: పిట్లం(M) మర్దండ గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా తయారైంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా రోడ్డు దుస్థితి మారడం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో ఆసుపత్రికి చేరుకోవడం కష్టంగా మారుతోందని గ్రామస్థులు వాపోయారు. అధికారులు స్పందించి రోడ్డు పనులు చేపట్టాలని కోరుతున్నారు.