JGL: ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామానికి చెందిన టీచర్ సిరిపురం మల్లయ్య కుమార్తె అమరానంద అసాధారణ ప్రతిభ కనబరచింది. శాతవాహన విశ్వవిద్యాలయం నిర్వహించిన రెండో స్నాతకోత్సవంలో తెలుగు విభాగంలో అత్యుత్తమ ప్రతిభకు గాను ఆమె నాలుగు బంగారు పతకాలు సాధించింది. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ స్వయంగా అమరానందకు బంగారు పతకాలు అందజేశారు.