WNP: అరుణాచలంలో జరిగే గిరి ప్రదక్షిణకు వనపర్తి నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ డీఎం దేవేందర్ గౌడ్ తెలిపారు. ఈనెల 15న సాయంత్రం బయలుదేరి, 16న కాణిపాకం, వేలూరు దర్శనం అనంతరం అరుణాచలం చేరుకుంటుంది. పెద్దలకు రూ. 3,600, పిల్లలకు రూ. 2,400 ఛార్జీ ఉంటుందని, యాత్ర 18న ముగుస్తుందని ఆయన వివరించారు.