VZM: సోమవారం ఉదయం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ రామ సుందర్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగుతుందన్నారు. అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. అర్జీదారులు గతంలో ఇచ్చిన స్లిప్పులు తీసుకురావాలని కోరారు.