AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతిలో పర్యటించనున్నారు. ఈరోజు రాత్రి 9:30 గంటలకు తిరుపతి వెళ్లనున్నారు. రాత్రి రాజ్ హోటల్లో బస చేయనున్నారు. రేపు ఉదయం మామండూరులో పర్యటించనున్నారు. మంగళం రోడ్డులోని ఎర్రచందనం గిడ్డంగిని పవన్ పరిశీలించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.