TG: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జోరుగా ప్రచారం నిర్వహించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమ ఆలోచనలను ప్రజల ముందు ఉంచామని తెలిపారు. 2004 – 2014 మధ్య కాలంలోనే హైదరాబాద్ ఎక్కువగా అభివృద్ధి చెందిందన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని సూచించారు.