ATP: కుందుర్పిలో ‘హలో దళిత-ఛలో ఢిల్లీ’ కరపత్రాలను ఇవాళ ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షుడు సాకే గురుమూర్తి ఆధ్వర్యంలో దళితుల ఆశా జ్యోతి, భారతదేశ పౌరుల హక్కుల ప్రధాత భారత దేశ మొట్టమొదట న్యాయశాఖ మంత్రి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుందుర్పి మండల నేత ఉసురుపాటి బ్రహ్మయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.