MLG: గోవిందరావుపేట మండలంలో కోతుల బెడద రోజురోజుకు పెరిగిపోతుందని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. కోతుల బెడదను నివారించాలని కోరుతూ మండల కేంద్రంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. కోతుల వల్ల ప్రాణభయం ఉందని, పంటలను సైతం నష్టపరుస్తున్నాయని మహిళలు తెలిపారు. ర్యాలీ అనంతరం స్థానిక తహసీల్దార్‌కు వినతి పత్రం అందించారు.