ADB: గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని MLA అనిల్ జాదవ్ అన్నారు. గురువారం పట్టణంలోని రెవెన్యూ గార్డెన్లో నిర్వహించిన ప్రగతి పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. పార్టీలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేలా సర్పంచులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో MLA పాయల్ శంకర్, కలెక్టర్ రాజర్షి షా తదితరులున్నారు.