కాంగ్రెస్ దేశ సైనికులను మోసం చేసిందంటూ బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ విమర్శలు చేశారు. ‘ఆర్మీ కుటుంబాలు దశాబ్దాల నుంచి వన్ ర్యాంక్ వన్ పెన్షన్(OROP) కావాలని అడుగుతున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ వారికి ఉట్టి అబద్ధాలే చెప్పింది. సరిగ్గా 11 ఏళ్ల కిందట నవంబర్ 7న మేము దాన్ని అమలు చేశాం. సైనికులకు, వారి కుటుంబాలకు రూ.లక్ష కోట్లు అందాయి’ అని తెలిపారు.