సత్యసాయి: హిందూపురం రూరల్ మండలం బీరేపల్లి పంచాయతీ వైసీపీ సీనియర్ లీడర్, మాజీ స్టోర్ డీలర్ రాజా రెడ్డి శనివారం గుండెపోటుతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న హిందూపురం వైసీపీ సీనియర్ నాయకుడు వేణురెడ్డి వారి గ్రామానికి వెళ్లి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.