కృష్ణా: రాబోయే దాల్వా పంట సాగు కాలానికి ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయాలని, అదేవిధంగా రైతులకు ఉచిత పంట బీమా పథకాన్ని కొనసాగించాలని కృష్ణా జిల్లా రైతు సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రైతు సంఘం ప్రతినిధులు పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ని కలిసి శనివారం వినతిపత్రం అందజేశారు.