ప్రకాశం: రేషన్ డీలర్లు కార్డుదారులకు బియ్యం వేయకుండా డబ్బులు ఇచ్చినట్లయితే వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్వో పద్మశ్రీ హెచ్చరించారు. శనివారం పామూరు పట్టణాల్లోని పలు రేషన్ దుకాణాలను ఆమె తనిఖీ చేశారు. ఈ మేరకు స్టాక్ రిజిస్టర్లు పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రేషన్ డీలర్లు కార్డుదారులకు సక్రమంగా సరుకులు పంపిణీ చేయాలని ఆమె సూచించారు.