AP: తిరుపతి జిల్లాలో ఎర్రచందనం గోదాముల్లో నిల్వలు భారీగా ఉన్నాయి. సుమారు 5,376 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం ఉంది. 2025 నుంచి విడతల వారీగా ప్రభుత్వం వేలం చేపట్టింది. మొదటి విడతలో 906 మెట్రిక్ టన్నుల అమ్మకానికి సిద్ధంగా ఉంది. MSTC ద్వారా ఎర్రచందనం టెండర్ల ప్రక్రియ జరిగింది. రూ.3 వేల కోట్ల ఆదాయం అంచనాతో టెండర్ల ప్రక్రియ పూర్తయింది.