ADB: బోథ్ మార్కెట్లో గల సోయ, మొక్కజొన్న కొనుగోలు కేంద్రములో అధిక మొత్తములో పంట నిలువలు చేరడం వలన రెండు రోజులపాటు ( 9,10 తేదీలలో) కొనుగోలును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మార్కెట్ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి తెలిపారు. తిరిగి 11వ తేదీ నుంచి యథావిధిగా కొనుగోళ్లు జరుపబడునని తెలిపారు. రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.