ADB: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే వైద్య శిబిరాలను ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సబ్ యూనిట్ అధికారి పవార్ రవీందర్ అన్నారు. శనివారం నేరడిగొండ మండలంలోని కోర్టికల్(కే) ఆశ్రమ బాలుర వసతిగృహంలో ఉచిత వైద్య శిభిరం నిర్వహించారు. పిల్లలకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణి చేశారు. కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ నర్సయ్య, హెచ్ఎం గంగారాం ఉన్నారు.