BDK: అశ్వాపురం మండల కేంద్రంలోని కాల్వ బజార్ షిరిడి సాయిబాబా ఆలయంలో శనివారం లయన్స్క్లబ్ ఆఫ్ స్టార్స్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ వైద్య శిబిరానికి విశేషంగా స్పందన లభించిందని లైన్స్ క్లబ్ ఆఫ్ స్టార్ సభ్యులు తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.