సత్యసాయి: మంత్రి నారా లోకేష్ పుట్టపర్తికి చేరుకున్నారు. ఆయనకు మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో కళ్యాణదుర్గానికి బయలుదేరారు. కాసేపట్లో పట్టణానికి చేరుకొని టీడీపీ కార్యకర్తలతో సమావేశమవుతారు. పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేస్తారని నేతలు తెలిపారు.