TG: ప్రైవేట్ కాలేజీలకు సీఎం రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. ‘తమాషాలు చేస్తే.. తాట తీస్తా. ఏది పడితే అది చేస్తే ఊరుకోవాలా?. విడతల వారీగా నిధులు విడుదల చేస్తాం. విద్యార్థుల జీవితాలతో ఆటలాడితే ఉపేక్షించం. వచ్చే ఏడాది నుంచి ఎన్ని డొనేషన్లు తీసుకుంటారో తెలియదా?. మీరు ఏ రాజకీయ పార్టీతో కలిసి ఇదంతా చేస్తున్నారో తెలియదా?’ అని మండిపడ్డారు.