VZM: పట్టణంలోని రాజీవ్ స్టేడియం నుండి టాక్సీ స్టాండ్ వరకు రహదారిపై ఉన్న ఆక్రమణలను ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం తొలగించారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఉండేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించామని ట్రాఫిక్ సీఐ సూరినాయుడు తెలిపారు. ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా రహదారులపై వ్యాపారం చేయకుండా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.