ఢిల్లీ సహా దేశంలోని అనేక నగరాల్లోని విమానాశ్రయాలలో ఒక్కసారిగా ATC వ్యవస్థ కుప్పకూలడంతో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీని కారణంగా ఆయా ఎయిర్‌పోర్టుల్లో విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ఉదయం నుంచి ఒక్క ఢిల్లీ ఎయిర్‌పోర్టులోనే 500కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి. ఈ సాంకేతిక లోపానికి సైబర్ ఎటాక్ కారణమై ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.