SKLM: హైదరాబాద్కి చెందిన వారధి పౌండేషన్ వారు అక్టోబర్ 16న రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన పోటీలో టెక్కలి మండలం సీతాపురం జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు ద్వితీయ బహుమతి పొందినట్లు హెచ్ఎం టి. పద్మావతి తెలియజేశారు. ఈ పోటీలకు ఎస్. భరత్, ఎస్. ఉదయశ్రీ, కె. శ్రీజ పాల్గొన్నారు. ఈ సందర్భంలో హెచ్ఎం విద్యార్థుల విజయానికి కృషిచేసిన ఉపాధ్యాయులను అభినందించారు.