TG: రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్లో తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం KCRకు అప్పగించిందని CM రేవంత్ గుర్తు చేశారు. 2024లో తాము అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్ర అప్పులు రూ.8.11 లక్షల కోట్లు అని తెలిపారు. HYDలో కనిపిస్తున్న అభివృద్ధి అంతా 2014కు ముందు జరిగిందేనని చెప్పారు. కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ గ్రోత్ ఇంజిన్‌గా మారిందని పేర్కొన్నారు.