VSP: దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 36వ వార్డు సున్నపు వీధిలో అభివృద్ధి పనులకు శుక్రవారం శంకుస్థాపన జరిగింది. 90 లక్షల GVMC నిధులతో రోడ్లు, డ్రెయిన్లు, మెట్లు వంటి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ పీలా శ్రీనివాస్, జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు, కార్పొరేటర్ మేరీ జాన్స్ రాజు పాల్గొన్నారు.