GNTR: వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కోసం ఏర్పాటు చేస్తున్న కేంద్ర నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కమిషనర్ పులి శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన గుంటూరులోని పొన్నూరు రోడ్లో నిర్మాణంలో ఉన్న వీధి కుక్కల కుటుంబ నియంత్రణ కేంద్రం పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్న కమిషనర్ పలు సూచనలు చేశారు.