KRNL: నగరంలోని జడ్పీ కార్యాలయంలో ఇవాళ జడ్పీ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఉమ్మడి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జిల్లా కలెక్టర్ సిరి, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ముఖ్యంగా రైతుల సమస్యలపై వాడి వేడిగా చర్చలు చేసినట్లు తెలిపారు.