AP: సీఎం చంద్రబాబు గుంటూరు వ్యవసాయ వర్సిటీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు మంత్రి అచ్చెన్నాయుడు, వర్సిటీ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఎన్జీ రంగా 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం ఎన్జీరంగా జీవిత ఘట్టాలు వివరించే ఫొటో ఎగ్జిబిషన్‌ను చంద్రబాబు తిలకించారు.