AP: అక్రమాస్తుల కేసులో మాజీ సీఎం జగన్ వ్యక్తిగత హాజరుపై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 14లోపు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని జగన్కు గతంలో కోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే వ్యక్తిగత హాజరు మినహయించాలని జగన్ పిటిషన్లో పేర్కొన్నారు.